![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -276 లో... రామరాజు అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చెయ్యడానికి ధీరజ్ వెళ్తాడు కానీ, అప్పుడే కౌంటర్ క్లోజ్ చేసి రేపు రమ్మంటారు. మరొకవైపు నా అల్లుడికి డబ్బు పంపించాక అందులో ఎంత అమౌంట్ ఉందో చెప్పండి అని రామరాజు ఫోన్ లో మేనేజర్ తో మాట్లాడతాడు. మీ అకౌంట్ లో పన్నెండు లక్షలున్నాయని మేనేజర్ అనగానే అదేంటి పద్నాలుగు లక్షలకి.. మీరు ఒక లక్ష అల్లుడికి పంపారు.. మరి అలా అంటారు ఏంటని రామరాజు అంటాడు. వారం క్రితం మీ అకౌంట్ నుండి మీ అబ్బాయి అకౌంట్ కి డబ్బు పంపించుకున్నారని మేనేజర్ చెప్పగానే రామరాజు షాక్ అవుతాడు.
మరొకవైపు నర్మద MRO కాబట్టి తన దగ్గరికి సేనాపతి వచ్చి.. మా అక్క పేరున ల్యాండ్ రిజిస్ట్రేషన్ చెయ్యమని అడుగుతాడు. తనే రావాలని నర్మద చెప్తుంది. వెంటనే భద్రవతికి సేనాపతి ఫోన్ చేసి రమ్మంటాడు. భద్రవతి వచ్చి నర్మదపై కోప్పడుతుంది. ఎన్నోసార్లు రిజిస్ట్రేషన్ చేయించారు కానీ, ఇలా ఎప్పుడు నేను వచ్చే అవసరం రాలేదు చూస్తానని భద్రవతి అంటుంది.
మరొకవైపు ధీరజ్ డబ్బు పట్టుకొని.. ఈ ఒక్కరోజు ప్రేమ కంటపడకుండా ఈ డబ్బుని జాగ్రత్త గా దాచాలని అనుకుంటాడు. అప్పుడే ప్రేమ వచ్చి.. ఈ డబ్బు ఎక్కడిదని అడుగుతుంది. ధీరజ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ, ప్రేమ మర్చిపోదు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇంటికి వెళ్తారు. ఎందుకు నా అకౌంట్ లో డబ్బు తీసావని ధీరజ్ ని రామరాజు కొట్టబోతుంటే.. తన చేతిని పట్టుకొని ప్రేమ ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |